పల్నాడులో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ ఆధ్వర్యంలో పోటాపోటీగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో  పోలీసులు పల్నాడులో భారీగా మోహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా... టీడీపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా... అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు టీడీపీ నేతలను ఇబ్బందులపాలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన గుంటూరులో వైసీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఈ నేపథ్యంలో దానికి పోటీగా.. పల్నాడులో వైసీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ బాధితుల సమావేశం చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సుచరిత కూడా హాజరుకానున్నారు.

ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా ముందుగా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.