టిడ్కో ఇళ్లలో అవినీతికి సంబంధించి  టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో కోనసీమ అంబేద్కర్ జిల్లా మండపేటలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కోనసీమ అంబేద్కర్ జిల్లా మండపేటలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య టిడ్కో ఇళ్ల వ్యవహారంలో సవాళ్లు , ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. టిడ్కో కాలనీ వద్ద భారీగా మోహరించడంతో పాటు 144 సెక్షన్ విధించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపుకు సంబంధించి టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని తోట త్రిమూర్తులు ఆరోపించారు. దీనిపై సెంటర్‌లో చర్చకు సిద్ధమని ఆయన ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. దీంతో జోగేశ్వరరావు దీనిని స్వీకరించారు. అంతేకాదు.. లబ్ధిదారులతో కలిసి ఉదయం 9 గంటలకల్లా ర్యాలీగా సభా వేదిక వద్దకు రావాలని మైకు ద్వారా పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో ఏం జరుగుతోందనని పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.