Asianet News TeluguAsianet News Telugu

పట్టాభిని కలవనిస్తారా .. లేదా, బిల్డింగ్ ఎక్కిన టీడీపీ కార్యకర్తలు : గన్నవరంలో హైటెన్షన్

కృష్ణా జిల్లా గన్నవరంలో పరిస్ధితులు ఉద్రిక్తంగానే వున్నాయి. ఈ రోజు టీడీపీ నేత పట్టాభి సహా అరెస్ట్ అయిన 15 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే పట్టాభి భార్య చందన సహా భారీగా తెలుగుదేశం కార్యకర్తలు కోర్టు వద్దకు చేరుకున్నారు. 
 

high tension in gannavaram over tdp activists protest
Author
First Published Feb 21, 2023, 5:21 PM IST

టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టాభి దగ్గరకు ఆయన భార్యను కూడా వెళ్లనివ్వడం లేదంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బిల్డింగ్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. పట్టాభి వద్దకు వెళ్లినివ్వని పక్షంలో భవనంపై నుంచి దూకేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతకుముందు పట్టాభి భార్య చందన మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తను కొట్టారని ఆరోపించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనను కొట్టారని చందన అన్నారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొచ్చి కొట్టారని.. తన భర్తకు ప్రాణహాని వుందని ఆమె ఆరోపించారు. 

కాగా.. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు , టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు పట్టాభి ప్రయత్నించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పట్టాభితో పాటు మరో 15 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వైద్యులను పిలిపించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. 

Also REad: పట్టాభీ ఆచూకీ కోసం ఇంటిముందే భార్య దీక్ష... ఫోన్ చేసి మాట్లాడిన రఘురామ...

అంతకుముందు గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ ఆయన భార్య చందన ఆందోళనకు దిగారు. నిన్న(సోమవారం) సాయంత్రం అరెస్ట్ చేసిన తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు... ఆయనకు ఏదయినా హాని తలపెడితే సీఎం జగన్, డిజిపి బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. భర్త ఆచూకీ తెలపాలంటూ చందన డిజిపి ఇంటిముందు ధర్నాకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు... దీంతో తన ఇంటిముందే కుటుంబసభ్యులతో కలసి దీక్ష చేపట్టారు. భర్త ఆఛూకీ కోసం ఆందోళన చేపడుతున్న చందనకు ఫోన్ చేసి పరామర్శించిన వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధైర్యం చెప్పారు. ఏపీ నూతన గవర్నర్ నజీర్ ను కలిసి పరిస్థితిని వివరిస్తానని... అధైర్యపడొద్దని చందనకు భరోసా ఇచ్చారు రఘురామ
 

Follow Us:
Download App:
  • android
  • ios