Asianet News TeluguAsianet News Telugu

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: కొనసాగుతున్న ఘర్షణలు, విశాఖలో టీడీపీ- వైసీపీ బాహాబాహీ

విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ-వైసీపీ వర్గాలకు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలు గాజు సీసాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి

high tension at visaka district after municipal polling ksp
Author
Visakhapatnam, First Published Mar 11, 2021, 2:22 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ-వైసీపీ వర్గాలకు ఘర్షణకు దిగాయి. ఇరు వర్గాలు గాజు సీసాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాజువాక ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య తగాదాతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 

కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న రాష్ట్రంలో అక్కడక్కడా ఘర్షణలు, దాడులు జరిగాయి. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికార పార్టీ అభ్యర్థుల్ని పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తూ తమను మాత్రం అధికారులు అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నాయకులు పలుచోట్ల నిరసనలు తెలిపారు.

కొంతమంది పోలీసులు అధికార పార్టీ అభ్యర్థులకు కొమ్ముకాస్తున్నారంటూ వివాదాలు జరిగాయి. గుంటూరు నగరంలోని 42వ డివిజన్‌ పదో నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలోకి వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి దౌర్జన్యంగా ప్రవేశించి, బ్యాలెట్‌ బాక్సులు నేలకేసి కొట్టేందుకే ప్రయత్నించారంటూ టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లు వారిని అడ్డుకున్నారు. కొద్దిసేపటికే వేణుగోపాలరెడ్డి వాహనంపై కొంతమంది రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది

Follow Us:
Download App:
  • android
  • ios