Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన జేసీ

మ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, గ్రామస్థులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు

high tension at tadipatri and mla jc protest infront of police station
Author
Hyderabad, First Published Nov 1, 2018, 2:51 PM IST


అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, గ్రామస్థులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే..  స్వామి ప్రభోదానంద స్వామి శిష్యడు నాగరాజు.. గురువారం ఉదయం గ్రామానికి చెందిన ఓ యువతి కళ్లల్లో కారం కొట్టి.. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు.

కాగా.. ఈ క్రమంలో యువతి గట్టిగా కేకలు పెట్టడంతో.. ఆమె కుటంబీకులు బయటకు వచ్చారు. నాగరాజుని పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసు స్టేషన్ లో అప్పగించారు. అయితే.. రివర్స్ లో నాగరాజు.. యువతి కుటుంబీకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరువైపులా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

నిందితుడు నాగరాజుని కాపాడుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,  గ్రామస్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. స్వామి ప్రబోధానంద స్వామిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.   దాదాపు 2గంటలపాటు ఇలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios