జీవో నెం 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెం 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

 ముట్టడిని అడ్డుకున్న పోలీసులకు, మున్సిపల్‌ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు మున్సిపల్‌ కార్మికులను అక్కడినుంచి ఈడ్చిపారేశారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.