Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌భుత్వంపై కోర్టు ఆగ్ర‌హం

  • ప్ర‌భుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం.
  • 278 మంది టీడీపీ నేత‌ల పై ఉన్న కేసులపై మరోసారి వివరణ కోరిన కోర్టు.
high court serious to AP government

ప్ర‌భుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. టీడీపీ నేత‌ల మీద ఉన్న‌ కేసుల‌ను ప్ర‌భుత్వం అర్థాంత‌రంగ ఉప‌సంహ‌రించిన విష‌యం తెలిసిందే. అదే విష‌య‌మై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి కోర్టు లో కేసు కూడా వేశారు. పిటీష‌న్ ను విచారించిన కోర్టు గ‌తంలోనే స‌మాధానం ఇచ్చేందుకు రెండు వారాల గ‌డువిచ్చింది. అయితే ప్ర‌భుత్వం కోర్టును అస్స‌లు లెక్కేచేయ‌లేదు. ఆ విష‌యం మీద‌నే కోర్టు ప్ర‌భుత్వం మీద చాలా సిరీయ‌స్ అయింది. కోర్టు ప్ర‌భుత్వానికి ఇచ్చిన గ‌డువు విష‌యాన్ని ఆళ్ల విచార‌ణ సంధ‌ర్భంగా ప్ర‌స్తావించారు.  

ప్ర‌భుత్వం అడిగిన‌ట్లే రెండు వారాలు గ‌డువిచ్చినా ఎందుకు స్పంధించ‌లేద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే పిటీష‌న్ పై స్పంధించేందుకు మూడు వారాలు గ‌డివిస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం చేసింది. 

ఇదేవిష‌యంపై ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ..  278 మంది టీడీపీ నేత‌ల పై ఉన్న కేసులను అడ్డ దారిలో  ఎత్తేసింద‌ని మండిప‌డ్డారు. అధికార‌ముంద‌ని చంద్ర‌బాబు చ‌ట్టాల‌ను కూడా లెక్క‌చేయ‌డం లేద‌న్నారు. నియ‌మ‌నింబధ‌న‌లను ప‌క్క‌న పెట్టి ఇష్ట‌రాజ్యంగా ప‌రిపాల‌న చేస్తున్నార‌ని చంద్ర‌బాబుపై ద్వ‌జ‌మెత్తారు. కేసుల ఉపసంహరించినవారి  జాబితాలో స్పీకర్‌, డిప్యూటీ సీఎం, ఎనిమిది మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప‌లువురు నేత‌లు ఉన్నారు.

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చెయ్యండి 

 

Follow Us:
Download App:
  • android
  • ios