Asianet News TeluguAsianet News Telugu

ఒక్క రోజు దీక్షకు రూ. 10 కోట్లా?: బాబు దీక్షపై హైకోర్టు ఆశ్చర్యం

ధర్మపోరాట దీక్షల కోసం ఖర్చు చేసిన నిధులపై ఏపీ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క రోజు దీక్ష కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించింది. ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని  ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High court Orders To AP Government To File Affidavit On Dharma Porata Dheeksha Expenditure
Author
Amaravati, First Published Oct 25, 2019, 11:11 AM IST

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మ పోరాట దీక్ష కోసం  రూ. 10 కోట్లు ఖర్చు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని ఆరోపిస్తూ అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్షను ప్రారంభించింది.

Also Read:ప్రజా ప్రతినిధులు జే(జగన్) ట్యాక్స్ కట్టాల్సిందే...: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలోని పలు చోట్ల ధర్మపోరాట దీక్షలతో పాటు ఢిల్లీలో కూడ ధర్మపోరాట దీక్షను చంద్రబాబు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు అప్పటి బాబు కేబినెట్‌లో మంత్రులు కూడ దీక్షలో పాల్గొన్నారు.దేశ రాజధానిలో కూడ తమ డిమాండ్‌ను వినిపించేందుకు గాను చంద్రబాబునాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఢిల్లీలో దీక్ష నిర్వహించారు. 

ఒక్క రోజు పాటు దీక్ష నిర్వహించారు. ఒక్క రోజు దీక్ష కోసం  రూ. 10 కోట్లు ఖర్చు  చేశారు. ఒక్క రోజు దీక్షకే రూ. 10 కోట్లు ఖర్చు చేస్తారా అని ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఏ నిబంధనల ప్రకారం రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులను ఖర్చు చేసిన అధికారి ఎవరు అనే విషయమై  హైకోర్టు ప్రశ్నించింది.ప్రజా ధనాన్ని పెద్ద మొత్తంలో ఎలా ఖర్చు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసు విచారణను ఈ ఏడాది నవంబర్ 21కు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడి ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో  జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. ఈ సమయంలో టీడీపీ, బీజేపీ నేతలు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారం సమయంలో మోడీ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడ చేరింది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక హోదా మాత్రం కేంద్రం ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీ  విషయంలో కూడ  చట్టబద్దత ఇవ్వకపోవడంతో చంద్రబాబునాయుడు ఆనాటి బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు.

అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తమ ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించారు. అంతేకాదు  ఎన్డీఏ  నుండి కూడ టీడీపీ వైదొలిగింది.నాడు ఎన్నికల .సమయంలో మోడీ తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షలను నిర్వహించాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios