గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డారనే  నెపంతో  ముగ్గురిని అక్రమంగా నిర్భందించిన ఘటనలో గుంటూరు అర్భన్ ఎస్పీ రామకృష్ణతో పాటు సీసీఎస్ పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 క్రికెట్ బెట్టింంగ్ కు పాల్పడినట్టుగా  అనుమానంతో  2019 అక్టోబర్ 14వ తేదీన నల్లబోలు ఆదినారాయణ, తుమ్మాటి శ్రీనివాసరావు, రాయుడు శ్రీనివాసరావులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

also read:ఇద్దరు ప్రియురాళ్లతో సంబంధం: ఎస్ఐ‌పై గుంటూరు ఎస్పీకి భార్య ఫిర్యాదు

ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారనే విషయమై కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. ఇదే విషయమై ఐజీ, డీఐజీ, ఎస్పీలకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన బాధిత కుటుంబాలు హైకోర్టులో వేర్వేరుగా  రెండు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో అదే రోజున చేబ్రోల్ పోలీస్ స్టేషన్ లో  ఈ నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రికార్డులు సృష్టించారని బాధితుల తరపు న్యాయవాది  మీడియాకు చెప్పారు.

ఈ ఘటనను హైకోర్టు  సీరియస్‌గా తీసుకొంది.జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. జ్యూడీషీయల్ విచారణపై కమిటీ నివేదికను  హైకోర్టుకు ఇచ్చింది. అయితే జ్యూడీషీయల్  కమిటీ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో  ఈ ఘటనపై విచారణకు సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశాలు  జారీ చేసింది.

గుంటూరు అర్బన్ ఎస్పీతో పాటు  సీసీఎస్ పోలీసులపై విచారణకు  ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం  బాధిత కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది.