Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ మొట్టికాయలు.. కోవిడ్ మరణాలపై రిపోర్టుకు ఆదేశాలు..

అమరావతి : ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై కోర్టుకు రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

high court fires on ap government over covid situation in state - bsb
Author
Hyderabad, First Published May 6, 2021, 4:55 PM IST

అమరావతి : ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై కోర్టుకు రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు కావాల్సిన ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసింది. అంతేకాదు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 

పరిస్థితులు విషమించకుండా నోడల్ అధికారులు 24×7 ఉండాలని  హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేసేలా సౌకర్యాలు పెంచాలని ఆదేశించింది.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై హైకోర్టు ఆరా తీసింది.  45 ఏళ్ల లోపు వారికి ఎపుడు వ్యాక్సిన్ వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అందరికి వ్యాక్సిన్ వేయటంలో ఇబ్బందులు ఏంటని కోర్టు ప్రశ్నించింది. దీనిమీద తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ కోర్టుకు వాయిదా వేసింది. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

Follow Us:
Download App:
  • android
  • ios