బ్రేకింగ్ న్యూస్ : స్పీకర్ కు కోర్టు నోటీసులు

First Published 10, Apr 2018, 2:05 PM IST
High court asked AP speaker to file counter on defection MLAs case
Highlights
మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన కేసు ఆధారంగా కోర్టు స్పీకర్ కు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఎంఎల్ఏల ఫిరాయింపులపై ఏపి అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాద్ కు కోర్టు నోటీసులిచ్చింది. వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన కేసు ఆధారంగా కోర్టు స్పీకర్ కు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఎంఎల్ఏల ఫిరాయింపులపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పీకర్ చర్యలు తీసుకోలేదని ఆళ్ళ తన పిటీషన్లో పేర్కొన్నారు. పిటీషన్ ను పరిశీలించిన కోర్టు మూడు వారాల్లోగా  కౌంటర్ దాఖలు చేయాలంటూ స్పీకర్ కు నోటీసిచ్చింది.

ఇప్పటికే ఫిరాయింపు వ్యవహారాలపై అనేక కేసులు హై కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

loader