Asianet News TeluguAsianet News Telugu

బాబుకు మరో రెండు నోటీసులు: బాంబు పేల్చిన హీరో శివాజీ

బాబ్లీ ఘటనలో సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ నోటీసులు ఇచ్చిన సంగతి మరువక ముందే నటుడు శివాజీ మరో బాంబు పేల్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మరో రెండు నోటీసులు అందనున్నాయని స్పష్టం చేశారు.

Hero Shivajo says Chandrababu may recieve two more notices
Author
Vijayawada, First Published Sep 14, 2018, 4:27 PM IST

విజయవాడ: బాబ్లీ ఘటనలో సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ నోటీసులు ఇచ్చిన సంగతి మరువక ముందే నటుడు శివాజీ మరో బాంబు పేల్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మరో రెండు నోటీసులు అందనున్నాయని స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు రావాల్సిన రెండు నోటీసులు సిద్ధంగా ఉన్నాయని శివాజీ చెప్పారు. ఆ నోటీసులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తనకు తెలుసునని అయితే భద్రతా కారణాల దృష్ట్యా చెప్పలేనన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇబ్బంది లేదని కానీ తన వ్యవస్థ అంతా వేరే రాష్ట్రంలో ఉందని తెలిపారు.

చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు కేవలం ప్రాథమిక నోటీసులు మాత్రమేనని ఆ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడితే మరో రెండు నోటీసులు అందబోతున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆట్రాప్ లో పడొద్దని శివాజీ హితవు పలికారు. చంద్రబాబుకు సంబంధించి నోటీసులపై మూడు రోజులుగా తాను న్యాయవాదులతో చర్చించానని తెలిపారు. రాజకీయ కారణాలతో వారి ట్రాప్ లో చంద్రబాబు పడొద్దని హితవు పలికారు. 

చంద్రబాబు నాయుడు ప్రజలు తన వెంట ఉన్నారని మహారాష్ట్ర వెళ్తే మరిన్ని ఇబ్బందుల్లో పడతారని శివాజీ సూచించారు. దయచేసి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర వెళ్లొద్దన్నారు. న్యాయనిపుణులు మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రవైట్ జెట్ లో ప్రయాణించొద్దని తెలిపారు. 

ఇటీవలే తాను సీఎం చంద్రబాబు నాయుడుకు నోటీసులు వస్తాయని చెప్తే పలువురు తనపై అవాకులు చెవాకులు పేలారని శివాజీ మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడకు వచ్చిన నోటీసులపై వాళ్లు మాట్లాడాలని డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉన్నవాళ్లే ఇలాంటి విషయాలు తెలుసుకుంటారని తనకు తెగింపు దమ్ము ధైర్యం ఉందని అందువల్లే తెలుసుకున్నానని తెలిపారు. 

ఏపీ చరిత్రలో తాను నిలిచిపోవాలని ఆశిస్తున్నానని అందుకే ఇలాంటి రహస్యాలు తెలుసుకుంటున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతుందంటూ శివాజీ పరోక్షంగా తెలిపారు. కుర్చీకోసం ఇంత దారుణంగా దిగజారతారా అంటూ ప్రశ్నించారు. కుర్చీ కాంక్ష మెుదలైనప్పుడే విధ్వంసం మెుదలవుతుందని శివాజీ అన్నారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ పూర్తికాలం బాధ్యతలు నిర్వహించాలని అంతేకానీ మధ్యలో కూలదోసే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యం కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదన్నారు. 

ఆపరేషన్ గరుడ గురించి తాను పదేపదే చెప్తే ఎవరూ నమ్మలేదని నమ్మకపోగా విమర్శించారని తెలిపారు. ఆపరేషన్ గరుడను ఆపరేషన్ వడ అంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆపరేషన్ గరుడపై మాట్లాడే సమయం వైసీపీకి లేదన్నఎమ్మెల్యే జగన్ అంత బిజీ అయిపోయారా అని ప్రశ్నించారు. జగన్ మహాత్ముడా అంటూ అని విమర్శించారు. జగన్ వయసులో తనకంటే చిన్నవాడని రాష్ట్రం కోసం ఏమైనా త్యాగం చేశారా అని ప్రశ్నించారు. కేవలం గ్రేట్ రాజశేఖర్ రెడ్డి తనయుడు కాబట్టేనని పేరు వచ్చిందన్నారు.

విశాఖపట్టణంలో పర్యటిస్తున్న జగన్ ప్రత్యేకహోదా కోసం ఏం చేస్తున్నారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఏం మాట్లాడారో తెలపాలన్నారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని చెప్తున్న జగన్ ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కేసుల్లో ఇరుక్కుంటే ఎమ్మెల్యేలు విడిపోతారని అప్పుడు తాను అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నట్లు ఉన్నారని అది కుట్ర అన్నారు. 11 చార్జ్ షీట్లు ఉన్న జగన్ పై ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం లేదో తెలుసుకోవాలన్నారు. 

నాయకుల వెనుక లక్షలాది మంది తిరుగుతున్నారనేది అవాస్తవమని శివాజీ తెలిపారు. ప్రజలు తమ అవసరాలు మానుకుని తిరగడం లేదన్నారు. ప్రతీ నాయకుడు తన రాజకీయం కోసం ప్రజలను పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేస్తున్నారని మండిపడ్డారు. 

మోదీకి ఎవరైనా ఎదురు తిరిగితే సహించలేరని శివాజీ ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎదురుతిరుగుతున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారని విమర్శించారు. యూఎన్ వోలో వ్యవసాయం కోసం మాట్లాడే అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడును అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈవార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. ఆపరేషన్ గరుడలో భాగమే: బుద్దా

ఆపరేషన్ గరుడ: నటుడు శివాజీకి మాజీమంత్రి కౌంటర్

చంద్రబాబుకు సోమవారం నోటీసులు: హీరో శివాజీ సంచలనం


 

Follow Us:
Download App:
  • android
  • ios