హైదరాబాద్: జనం ఫిక్సయ్యారని, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని సినీ హీరో శివాజీ అన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారని, తన దృష్టిలో చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రాన్ని ఎవరూ ఏం చేయలేరని ఆయన అన్నారు. 

చంద్రబాబు తర్వాత ఆయన కుటుంబం నుంచి ఎవరు వస్తారనేది వాళ్లకు సంబంధించిన విషయమని, ప్రజలు కోరుకున్నవాళ్లే నాయకుడవుతారని ఆయన అన్నారు. నాయకులు ప్రజల్లోంచే పుడుతారని శివాజీ చెప్పారు. 

జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆ స్థానంలో మరొకరు వస్తారని, చంద్రబాబు లేకపోతే ఇంకొకరు వస్తారని ఆయన చెప్పారు. అప్పట్లో ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ రాలేదా, రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత సోనియా గాంధీ రాలేదా అని ప్రశ్నించారు. వ్యవస్థ నిరంతర ప్రక్రియ అన్ని, వ్యవస్థకు ఎవరు ఏం చేశారనేది ముఖ్యమని ఆయన అన్నారు. 

చంద్రబాబు తన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని, దాన్ని ప్రజలు గుర్తించారనే అనుకుంటున్నానని శివాజీ అన్నారు ఒకవేళ అంతకన్నా ప్రతిభ ఉన్న వాళ్లను గుర్తించినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబే వస్తారని ఆయన అన్నారు. 

ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారని, ఎవరు ఏం చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకుంటున్నారనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. దాన్ని అందరూ గౌరవించాల్సిన అసరం ఉందని ఆయన అన్నారు. ఒక వేళ తన అభిప్రాయాన్ని వ్యతిరేకించినా వారికి ఆ హక్కుఉందని ఆనయ అన్నారు. తాను దాన్ని గౌరవించాలని ఆయన అన్నారు.