టీడీపీ హయాంలో హెరిటేజ్ సంస్థ సరఫరా చేసిన మజ్జిగకు సంబంధించి అవకతవకలు జరిగాయని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఏపీ కేబినెట్ గురువారం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసిన ఉత్పత్తులపై హెరిటేజ్ వివరణ ఇచ్చింది. తమ సంస్థ రూ.40కోట్ల విలువైన మజ్జిగను ప్రభుత్వానికి సరఫరా చేసిందన్నది అబద్ధమని తేల్చి చెప్పింది.

Also Read:హెరిటెజ్‌ మజ్జిగపై సీబీఐ విచారణ: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2015-16 నుంచి 2019-20  సరఫరా అయిన మజ్జిగ విలువ  రూ. 1.49కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ముఖ్యమైన పండుగలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తులు ప్రదానం చేశామని హెరిటేజ్ ప్రకటించింది.

బ్రహ్మోత్సవం, శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి ఇలా చాలా సందర్భాల్లో ఆర్డర్లు ఇతర కంపెనీలు, బ్రాండ్ లతో కలిసి ఒకే ధరకు ఆర్దర్లు పంచుకున్నామని కంపెనీ తెలిపింది.

మొత్తం ఆర్డర్ ఏ ఒక్క దానికి హెరిటేజ్ సంస్థ ఇవ్వలేదని.. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ టెండర్ లోనే  తాము పాల్గొన్నమని పేర్కొంది. 2014-15 నుంచి 2016-17 వరకు నెయ్యి సరఫరా మొత్తం ఆర్డర్ విలువ రూ 21.19 కోట్లని తెలిపింది.

Also Read:బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం

ప్రతి ఏడాది  అవసరమైన పరిమాణం భాగస్వామ్య సంస్థ ల ద్వారా పంపిణీ చేయబడిందని... ప్రతి ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉందని హెరిటేజ్ స్పష్టం చేసింది.

టెండర్లలో పాల్గొనే పంపిణీ అవకాశాలు దక్కించుకున్నామని, ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు సంస్థ పై  ఆధారపడిన రైతులకు ఉపయోగపడిందని తెలిపింది. సంస్థ పై అనవసర నిందలు మోపే ముందు లక్షల మంది రైతుల జీవనాధారాన్ని కలవర పెడుతున్నారని గ్రహించాలని హెరిటేజ్ హితవు పలికింది.