Asianet News TeluguAsianet News Telugu

రాయలసీమలో భారీ వర్షాలు: లోతట్టు ప్రాంతాలు జలమయం, నదులకు పోటెత్తిన వరద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో బుధవారం నాడు రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

Heavy rains lash  Andhra Pradesh
Author
Guntur, First Published Aug 4, 2022, 9:40 AM IST

కర్నూల్: Andhra Pradesh  రాష్ట్రంలోని Rayalaseema ప్రాంతంలో బుధవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీమ జిల్లాలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రాయలసీమలోని Kurnool , Kadapa, Anantapur  జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా జిల్లాలోని నదులు, వాగులు, వంకలకు వరద పోటెత్తింది. దీంతో  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ మూడు జిల్లాలో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్నూల్, నంద్యాల జిల్లాలో కురుస్తున్న Heavy Rains వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నందికొట్కూరులో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. జూపాడు బంగ్లాలో పారుమంచు వాగు పొంగింది.  అనంతపురం జిల్లాలో కురిసిన బారీ వర్షాల కారణంగా పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది.  తాడిపత్రిలో పెన్నాబ్రిడ్జిపై చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు తాడు సహాయంతో రక్షించారు. కడప జిల్లాలో పాపాగ్ని నదికి వరద పోటెత్తింది. కర్నూల్ జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి.ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరివాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గోదావరి ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.  తాజాగా కురిసిన వర్షాలతో మరోసారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుండి మరో మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో  లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  నైరుతి రుతుపవనాల కారణంగా  మంగళవారం నాడు ఉదయం నుండి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు మాత్రం భారీ వర్షాలు కురిసినట్టుగా అధికారులు ప్రకటించారు. రాస్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూగా వాతావరణ శాఖ సూచించింది.  మంగళవారం నాటికే నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో అత్యధికంగా 13 సెం.మీ. జూపాడు బంగ్లాలో 12 సెం.మీ. ఓర్వకల్లులో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
చిత్తూరు జిల్లా వి. కోటి, రొళ్ళ, శ్రీసత్యసాయి హిందూపురం జిల్లా తాడిమర్రి, అనంతపురం జిల్లా ఉరవకొండ, చిత్తూరు జిల్లా పుంగనూరు, నంద్యాలల జిల్లా దొర్నిపాడు, దోనే, బనగానపల్లెలో ఆరు సెం.మీ వర్షపాతం నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios