ఆంధ్రప్రదేశ్ లో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాగా... గుంటూరు జిల్లాలో అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, అమరావతి మండలాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 రాగల 40 నిమిషాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని.. చెట్ల కింద ఉండటం ప్రమాదకరమని ఆర్టీజీఎస్‌ ప్రకటించింది.