ఏపీలో గత రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో ఏపీ సచివాలయ ప్రాంగణం మొత్తం చిత్తడిగా మారిపోయింది. కాగా... ఈ రోజు ఏపీ నూతన మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ వర్షం కారణంగా ప్రమాణస్వీకార మహోత్సవానికి అడ్డంకిగా మారనుందా అనే సందేహాలు మొదలౌతున్నాయి.

అయితే... ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రమాణస్వీకారం ఆగకూడదనే కారణంతో అధికారులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని తన నివాసం వద్ద నుంచి ప్రమాణస్వకార ప్రాంగణానికి బయలు దేరారు. 8గంటల 35 నిమిషాలకు ఆయన సచివాలయంలో అడుగుపెట్టనున్నారు.