ఏపీ కి 3 రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీ లో సీఎం జగన్  సూత్రప్రాయంగా ప్రతిపాదించారు. అనంతరం రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ కు నాలుగు మండళ్లు 3 రాజధానులను సమర్థిస్తూ నివేదిక ఇచ్చినట్టు తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.  ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులను  భారీగా తరలిస్తున్నారు. 

Also read: చంద్రబాబుది మోసం కాదా, నా జీవితంలో మర్చిపోలేను: జగన్

జగన్ అధికారిక ప్రకటన చేసిన తరువాత గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అంబటినగర్(యర్రబాలెం) లోని ఓ కళ్యాణ మండపంలో సుమారు 300 మంది పోలీసులకు భోజన, వసతి ని ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం.  

ప్రభుత్వం ఏపీకి రాజధానిపై వేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక ను ఇచ్చేసింది. ఇప్పుడు రాజధాని పై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యం లోనే సీఎం జగన్ త్వరలోనే ఏపీ రాజధాని పై సంచలన ప్రకటన చేయబోతున్నారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు రోజున రాజధానిపై సీఎం జగన్ ఈ మూడు రాజధానుల బాంబు పేల్చినా విషయం తెలిసిందే.  ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని ఆయన దక్షిణాఫ్రికాను చూపెడుతూ ప్రశ్నించారు. 

Also read: కర్నూల్ రాజధాని అయితే ఒరిగేది ఏమీ లేదు.. అఖిల ప్రియ షాకింగ్ కామెంట్స్!

విశాఖపట్నం, అమరావతి, కర్నూలును ఏపీ రాజధానులుగా చేస్తామని ప్రతిపాదించారు.స్వయాన సీఎంయే ఏపీకి మూడు రాజధానలంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో అమరావతి రైతులు గగ్గోలుపెడుతున్నారు. 

గత ఆరు రోజులుగా రాజధాని రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అన్నదాతలకు, విద్యార్థులు , న్యాయవాదులు తోపాటు అక్కడి సామాన్య ప్రజలు సైతం మద్దతు తెలుపుతున్నారు. "3 రాజధానులు వద్దు... అమరావతియే ముద్దు" అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.   

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానుల పై అమరావతి రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ రాజధాని మార్పు పై చేసే ప్రకటన తర్వాత ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగకుండా ఉండేందుకే అమరావతి లో కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్టు తెలియవస్తుంది. దీంతో ఏపీ రాజధాని పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయబోతున్నారని సంకేతాలు అందుతున్నాయి.  

ప్రస్తుతానికి జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కడప జిల్లా పర్యటనకు వెళ్లారు.