Asianet News TeluguAsianet News Telugu

సీజేఐ బెంచ్ ముందుకు చంద్రబాబు పిటిషన్.. విచారణ మంగళవారానికి వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్ట్ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

hearing on chandrababu naidu quash petition adjourned for next week in supreme court ksp
Author
First Published Sep 27, 2023, 4:00 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సీజేఐ బెంచ్‌కు చేరింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. జస్టిస్ భట్టి, ఖన్నా బెంచ్ వేరే బెంచ్‌కు బదిలీ చేయడంతో సీజేఐని ఆశ్రయించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు సిద్ధార్థ్ లూథ్రా. త్వరగా లిస్ట్ చేయాలన్నదే తమ మొదటి అభ్యర్దన అని ఆయన పేర్కొన్నారు.

మధ్యంతర ఉపశమనం కలిగించాలన్నది రెండో అభ్యర్ధన అని సిద్ధార్థ్ తెలిపారు. 17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న చీఫ్ జస్టిస్.. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. అక్టోబర్ 3న అన్ని విషయాలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ప్రారంభం కాగానే.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు ప్రారంభించారు.

Also Read: సుప్రీం‌లో చంద్రబాబు క్వాష్ పిటిషన్.. విచారణకు జస్టిస్ జస్టిస్ భట్టి విముఖత..

అయితే ఈ పిటిషన్‌పై విచారణకు జస్టిస్ భట్టి‌కి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అయితే దాని గురించి దాని తామేమి చెప్పలేమని.. దయచేసి వీలైనంత త్వరగా జాబితా చేయండని లాయర్ హరీష్ సాల్వే కోరారు. అందుకు జస్టిస్ కన్నా.. వచ్చే వారం అని అన్నారు. ఇందుకు స్పందనగా న్యాయవాది సిద్దార్థ లూత్రా.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ముందు ప్రస్తావించడానికి అనుమతించాలని కోరారు. ఐదు నిమిషాల సమయ కోరారు. 

ఆ తర్వాత జస్టిస్ కన్నా.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.  ‘‘గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలకు లోబడి.. ప్రస్తుత స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే వారంలో నా సోదరుడు (జస్టిస్ భట్టి) సభ్యుడు కాని బెంచ్ ముందు ఉంచాలి...’’ అని జస్టిస్ కన్నా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వారం ప్రారంభం అని చెప్పలేమని జస్టిస్ కన్నా పేర్కొన్నారు. అయితే చంద్రబాబు న్యాయవాదులు మాత్రం ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేసేందుకు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios