Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తీవ్రంగానే కరోనా... వీధుల్లోకి అదనపు సిబ్బంది: అనిల్ సింఘాల్

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ తీవ్రంగా ఉందన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసులు తగ్గినప్పుడు కరోనా కేర్‌ సెంటర్లను మూసివేశామని.. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్దరిస్తున్నట్లు అనిల్ కుమార్ వెల్లడించారు

health secretary anil singhal pressmeet on covid cases in andhra pradesh ksp
Author
Amaravathi, First Published Apr 22, 2021, 9:46 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ తీవ్రంగా ఉందన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసులు తగ్గినప్పుడు కరోనా కేర్‌ సెంటర్లను మూసివేశామని.. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్దరిస్తున్నట్లు అనిల్ కుమార్ వెల్లడించారు.

దీనిలో భాగంగా 21 వేల మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని.. ఆస్పత్రులు, ఔషధాలు, పడకలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36 వేలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో 8 వేలు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు సింఘాల్ పేర్కొన్నారు.

Also Read:ఏపీలో కరోనా విలయతాండవం: 10 వేలు దాటిన కేసులు.. చిత్తూరు, సిక్కోలులో బీభత్సం

వీటికి అదనంగా మరో నాలుగు లక్షల ఇంజెక్షన్లను సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు అనిల్ కుమార్ వెల్లడించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 320 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని.. చెన్నై, బళ్లారి నుంచి మరో 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివివర్‌ అవసరం అంతగా లేదని అనిల్ స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో 19 వేల పడకలు సిద్ధం చేస్తే ఇప్పటి వరకు 11 వేల పడకలు నిండినట్లు సింఘాల్ చెప్పారు. మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios