Asianet News TeluguAsianet News Telugu

227కుచేరిన ఏలూరు బాధితుల సంఖ్య... 46మంది చిన్నారులే: మంత్రి నాని ప్రకటన

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారని హెల్త్ మినిస్టర్ నాని తెలిపారు.

health minister nani about eluru illness incident
Author
Amaravathi, First Published Dec 6, 2020, 12:31 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఇలా వందల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటివరకూ ఏలూరులో 227 మంది అస్వస్థతకు గురయ్యారని... బాధితుల సంఖ్య పెరుగుతోందని మంత్రి తెలిపారు.

''ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 70 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 76 మంది మహిళలు, 46 మంది చిన్నపిల్లలు మొత్తం 157 మంది ఆసుపత్రిలలో చికిత్స అందిస్తున్నాం'' అన్నారు.

read more   ఏలూరులో ఆందోళన... 100మందికి అస్వస్థత

''వెంటనే అప్రమత్తమై సమస్య ఉత్పన్నమైన ప్రాంతాల్లో మెరుగైన వైద్య క్యాంప్ లు పెట్టాం. ఎవరికి ప్రాణాపాయం లేదు. ఐదుగురికి రిపీటెడ్ గా ఫిట్స్ వస్తున్నాయి. కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నవారికి కాస్త విషమంగా ఉంటే వారిని విజయవాడ తరలించాం. సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు'' అని పేర్కొన్నారు.

''మధ్య వయస్కులు క్షేమంగా ఉన్నారు,  పిల్లలు, వృద్ధులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర స్థాయి ల్యాబ్ లో అన్ని పరీక్షలు చేస్తున్నాం. బాధితుల శ్యాంపిల్స్ కు నగరంలో నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదు. బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదు, నార్మల్ గా ఉంది. ఇంకా కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే క్షుణ్ణంగా రిపోర్ట్ తెలుస్తుంది'' అని ఆరోగ్య మంత్రి తెలిపారు.


 
 

Follow Us:
Download App:
  • android
  • ios