Asianet News TeluguAsianet News Telugu

నాడు హెడ్మాస్టర్ ఉండేవారు..నేడు లేరు...ఇదేనా మీ నాడు-నేడు: చంద్రబాబు (వీడియో)

 కరోనా సోకి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ గవర్నమెంట్ టీచర్ మృత్యువాతపడిన విషయం తెలిసిందే.

headmaster death with corona at nellore...chandrababu serious
Author
Amaravathi, First Published Aug 12, 2020, 7:13 PM IST

గుంటూరు: కరోనా సోకి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ గవర్నమెంట్ టీచర్ మృత్యువాతపడిన విషయం తెలిసిందే. అతడికి వైద్యం అందకే మృతిచెందినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించారు. 

 

''గురుదేవో భవః అని భావించే సమాజం మనది. అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ గారు తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని..  ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు''

''చివరికి రమేష్ గారు కన్నుమూశారు. నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు.ఇదేనా మీ నాడు-నేడు?ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా? తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చింది.ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు'' అంటూ చంద్రబాబు మండిపడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios