తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలోని శిరోముండనం బాధితుడు ప్రసాద్ రాసిన లేఖకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read:రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడు ప్రసాద్ లేఖ: జీఏడీ సెక్రటరీకి ఆదేశాలు

కాగా తనకు న్యాయం జరగకపోవడంతో మావోయిస్టుగా మారేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ లేఖపై పోలీసు అధికారి తీవ్రంగా  స్పందించారు. ఇసుక లారీలను అడ్డుకొనేందుకే పోలీసులు చిత్ర హింసలు పెట్టిన తనను శిరోముండనం చేశారని ప్రసాద్ ఆరోపించాడు.

ప్రసాద్ ఘటన ఏపీ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది.వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తనను కొట్టి చిత్రహింసలకు గురి చేయడంతో శిరోముండనం చేశారని ప్రసాద్ ఆరోపించాడు.