ప్రభుత్వము చేసే దిగజారుడు రాజకీయాలు మంచీ పద్దతి కాదు అనీ కన్నీటిపర్యంతమయ్యారు. నిన్న అసెంబ్లీలో YCP leaders తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత Chandrababu వాకౌట్ చేయడం, తదనంతరం ప్రెస్ మీట్ లో ఏడవడం ప్రకంపనలు రేపుతోంది.
గుంటూరు : చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన అనుచిత వ్యాఖ్యలకు కానిస్టేబుల్ కండించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న టైమ్ లొ తనకు ఉద్యోగం వొచ్చిందని, ఈ రోజు వరకు విలువలతో చేయిచాచా కుండా నిజాయతీగా బతికానని... తన గురించి ఏ ఎంక్వైరీ అయినా వేసి కనుక్కోవచ్చు అన్నారు.
"
ప్రభుత్వము చేసే దిగజారుడు రాజకీయాలు మంచీ పద్దతి కాదు అనీ కన్నీటిపర్యంతమయ్యారు. నిన్న అసెంబ్లీలో YCP leaders తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత Chandrababu వాకౌట్ చేయడం, తదనంతరం ప్రెస్ మీట్ లో ఏడవడం ప్రకంపనలు రేపుతోంది. దీని మీద ఈ రోజు నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
మరోపక్క ఈ వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అందోళన కార్యక్రమాలను చేపట్టాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన సతీమణిమై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ విమర్శించారని చంద్రాబాబు నాయుడు కంటతడి పెట్టారు.
ఆ ప్రెస్ మీట్ తర్వాత ఏపీలో రాజకీయ రగడ రాజుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణఉలు మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తాజాగా చంద్రబాబు మీద వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ Head Constable ఓ వీడియో విడుదల చేశారు.
Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్ లో సివిల్ కానిస్టేబుల్ గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్ గా నిలిచానని, అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాయితీగా పనిచేశానని చెప్పారు. ఎప్పుడూ, ఎక్కడా చేయి చాచకుండా విధులు నిర్వహించాలని అసెంబ్లీలో విలువ లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును దూషించడం సబబుకాదని ఆయన మండిపడ్డారు. విలువలేని వారివద్ద పనిచేయలేనంటూ ఆయన ప్రజల ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
