మహిళపై చెప్పుతో దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 3, Sep 2018, 11:08 AM IST
Head constable Brutally beats Female in his Police Station
Highlights

మద్యం మత్తులో ఓ హెడ్  కానిస్టేబుల్ స్టేషన్లో  వీరంగం సృష్టించాడు. రక్షించండీ అంటూ వచ్చిన బాధితురాలికి భరోసా కల్పించాల్సిన ఆ రక్షక భటుడు చెప్పుతో రెచ్చిపోయాడు. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేస్తూనే బాధితులపట్ల ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఓహెడ్ కానిస్టేబుల్ మహిళ అని కూడా చూడకుండా ఇలా చెప్పుతో దాడి చెయ్యడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వత్రా విస్మయానికి గురిచేసిన ఈ ఘటన గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. 
 

గుంటూరు: మద్యం మత్తులో ఓ హెడ్  కానిస్టేబుల్ స్టేషన్లో  వీరంగం సృష్టించాడు. రక్షించండీ అంటూ వచ్చిన బాధితురాలికి భరోసా కల్పించాల్సిన ఆ రక్షక భటుడు చెప్పుతో రెచ్చిపోయాడు. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేస్తూనే బాధితులపట్ల ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఓహెడ్ కానిస్టేబుల్ మహిళ అని కూడా చూడకుండా ఇలా చెప్పుతో దాడి చెయ్యడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వత్రా విస్మయానికి గురిచేసిన ఈ ఘటన గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. 


నగరపాలెం పోలీస్ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు విచారణ నిమిత్తం ఆదివారం రాత్రి 11గంటల సమయంలో కొందరు మహిళలను స్టేషన్ కు తీసుకువచ్చారు. వారంతా నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన మహిళలు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. 

ఓ మహిళ వద్దకు వచ్చి వీరంగా సృష్టించాడు. అంతా చూస్తుండగానే మహిళను చెప్పుతో కొట్టడంతో కొందరు ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు విచారణ చేపడుతున్నారు. 

అయితే హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు స్టేషన్ లో ఎవరి అనుమతి లేకుండానే మహిళలను స్టేషన్ కు తీసుకువచ్చినట్లు తెలిసింది. మహిళపై చెప్పుతో దాడి సమయంలో వెంకటేశ్వరరావు మద్యం మత్తులో ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. విచారణ అనంతరం హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీస్ ఉన్నతాధికారులు. 

loader