వైసీపీ ఓ ఉన్మాదపార్టీ. జగన్ పై విరుచుకుపడ్డ సీఎం చంద్రబాబు

ముఖ్య‌మంత్రి పై జ‌గ‌న్ నంద్యాల్లో ప్రచారంలో చేసిన వివాదస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను బాబు లైట్ గా తీసుకున్నారు. చంద్ర‌బాబు "న‌న్ను కాలుస్తాడంట‌... ఉరితీస్తాడంట‌.. నా బ‌ట్ట‌లు విప్పుతాడంట" అని జ‌గ‌న్ వ్యాఖ‌ల‌ను వ్యంగ్యంగా అన్నారు. అమ‌రావ‌తిలో జ‌ర‌గిన వైసీపి నుండి టీడీపీకి వ‌ల‌స‌ల స‌భ‌లో ఆయ‌న జ‌గ‌న్ పై ధ్వ‌జ‌మెత్తారు.

 వైసీపీ ఓ ఉన్మాదపార్టీ అని చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మూడేళ్లలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నో అభివృద్ధి ప‌నులు చేసిందని ముఖ్య‌మంత్రి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని పెర్కొన్నారు. జ‌గ‌న్ వ‌య‌సు త‌న అనుభ‌వం అంత కూడా లేద‌ని చంద్ర‌బాబు ఎద్దేవా చేశారు.

 జ‌గ‌న్ త‌న ప‌ద‌వికి ఎక్క‌డ ఎస‌రు పెడ‌తాడ‌నే భ‌యంతో అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జగన్ ను బెంగళూరుకి పంపారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. జగన్ ను తండ్రే భరించలేకపోయారని, ఇక రాష్ట్రప్రజలు ఎలా భరిస్తారని చంద్ర‌బాబు ప్రశ్నించారు. 


సీఎం చంద్రబాబు సమక్షంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ గుత్తుల సాయి టీడీపీలో చేరారు. ఆయనతో పాటుగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ కండువాలు క‌ప్పుకున్నారు. 2016 వరకు వైసీపీలో నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. అయితే ఆ తర్వాత అదనపు కో ఆర్డినేటర్‌గా పితాని బాలకృష్ణను నియమించడంతో గుత్తుల సాయి, పితాని వర్గీయుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అందుకే నేడు ఆయ‌న టీడీపీలో చేరారు.