వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని మీరు ఈ ఫోటోలో చూడొచ్చు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు.

"