రాజకీయ సన్యాసం పై నేతల స్పంధన. మంత్రి పట్టించుకోలేదు కావున అంత ప్రాధాన్యత లేదన్న శిల్పా. రాజకీయ సన్యాసం పై మాట మార్చుతున్నారన్న మంత్రి అఖిల.
శిల్పామోహాన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నా లేకున్న పెద్దగా తేడా ఏమీ లేదని మంత్రి అఖిల ప్రియ ఎద్దేవా చేశారు. గతంలో మంత్రి చేసిన రాజకీయ సన్యాసం సవాల్ పై స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు, ఉప ఎన్నిక ప్రచార సమయంలో అఖిల మాట్లాడుతూ.. టీడీపీ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, వైసీపీ ఓడిపోతే శిల్పా మోహాన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరిన సంగతి అందరికి తెలిసిందే,
అదే విషయాన్ని అఖిల దగ్గర మీడియా ప్రస్తావించిన్నప్పుడు.. నాడు తాను సవాల్ విసిరినప్పుడు శిల్పా స్పందించలేదు అని అన్నారు, పైగా కౌంటింగ్ జరుగుతన్నప్పుడు తన మాటలపై ఎదురుదాడి చెయ్యడాన్ని మంత్రి తప్పుపట్టారు, సన్యాపం నుండి తప్పించుకోవడానికే శిల్పా ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు, స్థానికంగా ప్రజలకు వైసీపి పార్టీ కంటే శిల్పా సోదరుల మీద వ్యతిరేకత అధికంగా ఉందని తెలిపారు, నాడు భూమా కుటుంభం పై సానుభూతి లేదన్న వాళ్లే నేడు తమ అభ్యర్థీ విజయం సాధిస్తే సానుభూతిలో గెలిచిందనటం చాలా విడ్డూరంగా ఉందని పెర్కోన్నారు. నంద్యాల ఉప ఎన్నిక గెలుపుకు కారణం ముఖ్యమంత్రి ప్రచారం, ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు, ప్రచారం కోసం కష్టపడ్డ కార్యకర్తలుగా అఖిల పెర్కోన్నారు.
కాగా శిల్పా మోహాన్ రెడ్డి కౌంటింగ్ సందర్భంగారా జకీయ సన్యాసం సవాల్‌ను మంత్రి అఖిల ప్రియ పట్టించుకోలేదు కాబట్టి నేను మాట మీద నిలబడాల్సిన అవసరం లేదని ఆయన పెర్కోన్నారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి
