అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన కిడ్నీ సంబంధిత వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోర్న్ వెంట్రే శ్రీకాకుళంకు వస్తున్నారు. ఈనెల 29వ తేదీన ఉత్థానం ప్రాంతంలో డాక్టర్ తన బృందంతో పర్యటించనున్నారు. ఉత్థానం సమస్య మూలాలు కనుగొని పరిష్కరించేందుకు వస్తున్నట్లు చెప్పారు.

దశాబ్దాల ఉథ్థానం కిడ్నీ సమసపై అమెరికా స్ధాయిలో కదలిక వచ్చిందంటే క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్ దే. కిడ్నీ సమస్యపై అధ్యయనం చేయటానికి, బాధితులతో మాట్లాడేందుకు అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన కిడ్నీ సంబంధిత వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోర్న్ వెంట్రే శ్రీకాకుళంకు వస్తున్నారు. ఈనెల 29వ తేదీన ఉత్థానం ప్రాంతంలో డాక్టర్ తన బృందంతో పర్యటించనున్నారు. ఉత్థానం సమస్య మూలాలు కనుగొని పరిష్కరించేందుకు వస్తున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారానికి ఉథ్థానంలో ప్రపంచస్ధాయి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పారు. దశాబ్దాల సమస్యపై పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ ఓ వీడియో సందేశాన్ని కూడా పంపారు.