Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ లో పందులు పట్టుకోవడానికి చెన్నై టీమ్..!

ఓ మహిళ నేతృత్వంలోని ఈ బృందం దాదాపు వారం రోజుల్లో పందులన్నింటినీ పట్టుకోనున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిశోర్ తెలిపారు.
 

GVMC ropes Chennai team to catch stray pigs in Vizag
Author
Hyderabad, First Published Jul 16, 2021, 9:46 AM IST

గ్రేటర్ విశాఖ పరిధిలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో.. వాటిని పట్టుకునేందుకు జీవీఎంసీ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు ప్రత్యేకంగా చెన్నై నుంచి ఓ బృందాన్ని రప్పించారు. ఆ టీమ్ లో దాదాపు 70మంది సభ్యులు ఉండటం గమనార్హం.

వీరంతా వారం రోజులపాటు విశాఖలోనే ఉంటూ.. ఆ పందులన్నింటినీ పట్టుకోనున్నారు. ఓ మహిళ నేతృత్వంలోని ఈ బృందం దాదాపు వారం రోజుల్లో పందులన్నింటినీ పట్టుకోనున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిశోర్ తెలిపారు.

నగరంలో పందుల సంచారం ఎక్కువగా పెరిగిపోయిందని.. అవి తెగ ఇబ్బందులు పెడుతున్నాయంటూ స్థానికులు.. అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో..  ఏయే ప్రాంతాల్లో ఎక్కువ పందులు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు 20 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

అనంతరం చెన్నై టీమ్ ని పిలిపించామని.. వారి సహాయంతో ఈ పందులన్నింటినీ పట్టుకోనున్నట్లు ఆయన చెప్పారు.  మొత్తం 942 పందులు ఉన్నట్లు గుర్తించామని.. రోజుకి వంద పందులనైనా పట్టుకోవాలని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios