Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రజలకు కేసీఆర్ తలవంచి క్షమాపణ చెప్పాలి.. మా పార్టీలో నుంచి బీఆర్ఎస్‌లోకి ఎవరూ వెళ్లరు: ఎంపీ జీవీఎల్

తెలంగాణ కేసీఆర్ తిట్లను ఏపీ ప్రజలు మర్చిపోలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే కేసీఆర్ రాష్ట్రంలో అడుగుపెట్టాలని అన్నారు. 

gvl narasimha rao Says KCR Should enter andhra after say sorry to its people
Author
First Published Jan 21, 2023, 2:46 PM IST

తెలంగాణ కేసీఆర్ తిట్లను ఏపీ ప్రజలు మర్చిపోలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే కేసీఆర్ రాష్ట్రంలో అడుగుపెట్టాలని అన్నారు. శనివారం జిల్లా గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన బెంచీలను జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 12 రైల్వేస్టేషన్‌లలో రూ.50 లక్షల ఎంపీ లాడ్స్‌తో ప్రయాణీకుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైల్వే రంగంలో మోదీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకోస్తున్నారని చెప్పారు. 

కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమే  కాకుండా.. టీఆర్ఎస్ పార్టీ(ప్రస్తుత బీఆర్ఎస్) రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను ఇక్కడ ఎవరూ యాక్సెప్ట్ చేయరని అన్నారు. తమ పార్టీలో నుంచి బీఆర్ఎస్‌లోకి ఎవరూ వెళ్లరని చెప్పారు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తలవంచి ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios