Asianet News TeluguAsianet News Telugu

ఇరిగేషన్ ఇంజనీర్‌పై గ్రామస్థుల దాడి: భయంతో పరుగు

నీటిపారుదల శాఖ ఇంజనీరుపై గుర్రాలగడ్డ ప్రజలు దాడికి దిగారు. దీంతో ఆయన గ్రామం నుండి పరుగులు తీశాడు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Gurrala Gadda villagers attacked on irrigation engineer Raghunath Reddy in Kadapa district lns
Author
Kadapa, First Published May 24, 2021, 7:46 PM IST

కడప: నీటిపారుదల శాఖ ఇంజనీరుపై గుర్రాలగడ్డ ప్రజలు దాడికి దిగారు. దీంతో ఆయన గ్రామం నుండి పరుగులు తీశాడు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుగ్గవంక సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనుల కోసం జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తున్నారు.  రెండు రోజులుగా ఇళ్లను కూల్చివేయడంపై  స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. 

గుర్రాలగడ్డ గ్రామానికి ఇంజనీరు రఘునాథ్ రెడ్డి గ్రామానికి వచ్చారు.  రెండు రోజులుగా తమ గ్రామంలో ఇళ్లను కూల్చివేతలో ఇంజనీర్ రఘునాథ్ రెడ్డిదే కీలక పాత్రగా భావించిన గ్రామస్తులు ఆయనపై దాడికి దిగారు.కర్రలు, రాళ్లతో ఆయన పై దాడి చేశారు. దీంతో ప్రాణభయంతో ఆయన గ్రామం నుండి పరుగులు తీశాడు.  తనపై  జరిగిన దాడి గురించి ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లను కూల్చివేయడంపై  గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడ ఇదే తరహాలో కొన్ని ఘటనలు చోటు చేసుకొన్నాయి. తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios