గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో ఓ దళితురాలు పోలీసులు మందురే ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే అధికారుల అప్రమత్తం కావడంతో ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉన్నది. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల కాదు, ఆస్తి తగాదాల వల్లే ఆ మహిళ పురుగుల మందు తాగిందని వివరించారు.  

గుంటూరు: గుంటూరు జిల్లాలో దుర్గి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పోలీసుల ముందే ఆమె యత్నానికి పాల్పడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. సరైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. పోలీసులు పట్టించుకోకపోవడమే వల్లే ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డట్టు కొన్ని వాదనలు వచ్చాయి. పోలీసులు ఆ ఆరోపణలను ఖండించారు. ఆస్తి తగాదాల కారణంగానే ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డట్టు వివరించారు.

దుర్గి గ్రామంలో పోలీసులు స్పందనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుర్గి గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ పురుగుల మందు డబ్బా పట్టుకువచ్చి హల్‌చల్ చేసింది. అందరి ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై రూరల్ జిల్లా స్పందనా సీఐ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. 

రాజేశ్వరి భర్తకు రావాలసిన 1.5 ఎకరాల భూమిని ఆమె భావ (తన భర్త అన్న) ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాడని, ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భావ తమ భూమిని ఇంకా తాకట్టులోనే ఉంచాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె దుర్గి పోలీసుల దగ్గర ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్ దాఖలైన తర్వాత ఉభయ పక్షాలను పోలీసులు పిలిపించుకుని చర్చించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా వారికి సూచించారు. అంతేకాదు, వారికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించి వెనక్కి పంపారు.

అయినప్పటికీ ఆ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉన్నది. దీంతో వారు మల్లీ పోలీసులను ఆశ్రయించి సమస్యను విన్నవించుకున్నారు. దీంతో ఆ సమస్య సివిల్ వివాదం కిందికి వస్తుందని, కాబట్టి, కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా పోలీసులు వారికి సూచనలు చేశారు. కానీ, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో దుర్గి గ్రామంలో నిర్వహించిన స్పందనా కార్యక్రమానికి మళ్లీ ఆమె వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. దీంతో చట్ట పరిధిలో తగిన న్యాయం చేస్తామని పోలీసులు ఆమెకు చెప్పినట్టు రూరల్ జిల్లా స్పందనా సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమాధానంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె వెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బా సేవించింది. ఇది గమనించిన పోలీసులు సిబ్బంది హుటాహుటిని ఆమెను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించింది. ప్రాథమిక చికత్స చేశారని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉన్నదని తెలిపారు. అంతేకాదు, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరినట్టు వివరించారు. వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

దుర్గి పోలీసులు పట్టించుకోలేదని, తనకు అన్యాయం చేసారని, మహిళా చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తమ పై అధికారుల సూచనల మేరకు సదరు ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.