గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్‌ఐ రవితేజపై ఓ యువతి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆరోపించింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్‌ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. బెదిరింపులకు కూడా దిగుతున్నాడని తెలిపింది. అయితే ఇదే విషయంపై కొద్దిరోజుల క్రితం గుంటూరు అర్బన్ ఎస్పీకి బాధిత యువతి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో మహిళా సంఘాలతో కలిసి నిరసనకు దిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటామని బాధిత యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. తాను గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది.