గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్రమ సంబంధం కేసుని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పారబత్తిన సీతారామాంజనేయులు హత్య కేసులో పురోగతి సాధించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మృతుని భార్య, సోదరుడే  హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మృతుని భార్య లక్ష్మీకి, మృతుని అన్న దుర్గా ప్రసాద్‌కు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణలతో కలిసి నవులూరు క్రికెట్ స్టేడియం వెనుక హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు.

కాగా సీతారామాంజనేయులు కేసును విచారిస్తున్న పోలీసులకు మరో హత్య కేసు గురించిన వివరాలు తెలిశాయి. తోడేటి నాగరాజు గతంలో పిడుగురాళ్లకు చెందిన అన్నా అనే వ్యక్తిని హత్య చేసినట్లు విచారణ తేలింది.

చిన్నాని నాగరాజు గుంటూరు ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని ఓ గదిలో కొట్టి హతమార్చాడు. ఒకే విచారణలో రెండు హత్య కేసులను ఛేదించి.. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.