2024 ఎన్నికల్లో వైసిపిని గద్దెదింపుతాం...: అంగన్వాడీ అధ్యక్షురాలు షేక్ జానీబేగం (వీడియో)
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అంగన్వాడీ, డ్వాక్వా మహిళల సత్తా ఏమిటో చూపిస్తామని... వైసిపిని గద్దెదింపడం ఖాయమని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ అధ్యక్షురాలు హెచ్చరించారు.

గుంటూరు : అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసిపి నాయకులు అంగన్వాడీలను వేధింపులకు గురిచేస్తున్నారని టిడిపి గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ అధ్యక్షురాలు షేక్ జానీ బేగం ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలో ధర్నా చేస్తే పోలీసులతో స్టేషన్ కు తరలించారని అన్నారు. చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా అగన్వాడీలను విధులనుండే తొలగించారని అన్నారు. వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని... లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపిని గద్దె దించుతామని షేక్ జానీభేగం తెలిపారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని... మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అప్పుడు మా డ్వాక్రా, అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపుతారని అన్నారు. వ్యస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారన్నారు. కుంభకోణాలు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు ప్రస్తుతం ప్రభుత్వంలోని పెద్దలు... కానీ అక్రమ కేసులు మాత్రం చంద్రబాబుపై పెడుతున్నారని జానీభేగం మండిపడ్డారు.
వీడియో
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణి స్త్రీలకు ఇస్తున్న ఆహార పదార్థాలు నాసిరకంగా వుంటున్నాయని జానీబేగం అన్నారు. పౌష్టికాహారం పేరుతో గర్బిణులకు పంపిణీ చేసిన ఖర్జూరా ప్యాకెట్స్ లో పురుగులు వుంటున్నాయని ఆరోపించారు.
ఇక అంగన్వాడీలతో గొడ్డుచాకిరి చేయిస్తున్న ప్రభుత్వం జీతాలు మాత్రం పెంచడం లేదని అన్నారు. అంగన్వాడిలతో పాటు డ్వాక్రా మహిళలకు ఉద్యగా భద్రత లేదన్నారు. కానీ ప్రభుత్వం ఏ సభ పెట్టినా డ్వాక్రా మహిళలను సభలకు తరలిస్తున్నారని జానీబేగం మండిపడ్డారు.