Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ:లోకేష్ సహా 33 మందిపై కేసులు నమోదు


 లోకేష్ సహా 33 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. బీటెక్ స్టూడెంట్ రమ్య  కుటుంబసఁభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు సాయంత్రం టీడీపీ నేతలను పోలీసులు విడుదల చేశారు.

Guntur police files case against Lokesh and other 33 TDP leaders
Author
Günzburg, First Published Aug 17, 2021, 4:05 PM IST


గుంటూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య తర్వాత ఆమె కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ సహా ఆ పార్టీ ముఖ్క నేతలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  సోమవారం నాడు లోకేష్ సహా ఆ పార్టీ నేతలను 151 సీఆర్‌పీసీ చట్టం కింద అరెస్ట్ చేసి సాయంత్రం విడుదల చేశారు.

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో లోకేష్ సహా మొత్తం 33 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, నక్కా శ్రవణ్ కుమార్  తదితరులపై కేసులు నమోదు చేశారు.

రమ్య హత్య ఘటనపై రాజకీయపార్టీలు వ్యవహరించిన తీరును గుంటూరు రేంజ్ ఇంచార్జీ డీఐజీ రాజశేఖర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలో రాజకీయపార్టీల నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు.ఇవాళ లోకేష్ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios