వావి వారసలు మరిచి కన్నకూతురిపైనే అత్యాచారం చేసిన నాగరాజు అనే వ్యక్తికి మరణించే వరకు జైలు శిక్ష విధించింది పోక్సో కోర్ట్. గుంటూరు జిల్లా లాలాపేట రేప్ కేసులో ఈ తీర్పు వెలువరించింది.
గుంటూరు జిల్లా లాలాపేట రేప్ కేసులో కీలక తీర్పునిచ్చింది పోక్సో కోర్ట్. వావి వారసలు మరిచి కన్నకూతురిపైనే అత్యాచారం చేసిన నాగరాజు అనే వ్యక్తికి మరణించే వరకు జైలు శిక్ష విధించింది. కూతురిని గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు నాగరాజు. ఆమె గర్భందాల్చడంతో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు. ఎదురుతిరిగితే దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది.
మృతి చెందిన తన కుమార్తెకు మతిస్థిమితం లేదని చెబుతూ.. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు నాగరాజు. అయితే చివరికి మృతురాలి గర్భంలో బిడ్డానికి డీఎన్ఏ టెస్ట్ చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2017లో గుంటూరు లాలాపేట పరిధిలోని నల్లచెరువులో ఈ దారుణం జరిగింది. ఆరోపణలు రుజువు కావడంతో నిందితుడు నాగరాజును చనిపోయే వరకు జైల్లోనే వుంచాలని పోక్సో కోర్ట్ ఆదేశించింది.
