Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలిని సంతోష పెట్టడానికి .. పత్తి వ్యాపారి దారి దోపిడీ డ్రామా.. కట్ చేస్తే..  

గుంటూరు జిల్లాలో దారి దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఓ పత్తి వ్యాపారి.. ఆడిన దోపిడీ నాటకాన్ని బయటపెట్టారు. తన ప్రియురాలికి డబ్బు ఇవ్వడానికి  దారి దోపిడీ నాటకం అడినట్లు గుర్తించారు.

Guntur Cotton Buyer Theft Drama Money Given To Lover Son
Author
First Published Dec 26, 2022, 6:34 AM IST

అతడో పత్తి వ్యాపారి. గత పదేండ్లుగా అందరితో నమ్మకంగా మేదులుకుంటున్నాడు. స్థానిక రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి పత్తిని మిల్లు యజమానులకు విక్రయిస్తుంటాడు. కానీ.. ఈ నెల 17 వ తేదీన అతనిపై దుండుగలు దాడి చేసి రెండు లక్షల రూపాయలను అపహరించుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అతని గురించి ఆరా తీస్తే.. అందరూ ఆ వ్యక్తి చాలా మంచివాడనే చెప్పారు. కానీ.. దారి దోపిడికి.. అతడు చేప్పేదానికి.. జరిగిన దానికి పొంతన లేకుండా పోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో పత్తి వ్యాపారి అసలు బండారం బయటపడింది. ఆ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు డబ్బులు ఇవ్వడానికి.. ఇలా దోపిడి డ్రామా ఆడి.. అడ్డంగా బుక్కయ్యాడు. 

అసలేం జరిగిందంటే..?

గుంటూరు జిల్లా కంతేరు మండలానికి చెందిన గంధం శ్రీను పదేళ్లుగా పత్తి వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. అతడు స్థానిక రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మిల్లు యజమానులకు విక్రయిస్తుంటాడు. అలా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా,లాభదాయక జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చేదు అలవాట్లకు బానిసైన శ్రీను  ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఇలాంటి డబ్బులు అడిగింది.  

ఎప్పటిలాగానే.. ఈ నెల 17వ తేదీన రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మిల్లు యజమానులకు విక్రయించాడు. అతనికి రెండు లక్షల రూపాయలు వచ్చాయి. వాటిపై వ్యాపారి శ్రీను కన్నుపడింది. ఎలాగైనా కాజేయాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడువుగా.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి ఫోన్ చేసి తను ఉన్న చోటుకు రప్పించుకున్నాడు. రెండు లక్షల రూపాయలు ఇచ్చి పంపించాడు. 

ఆ తరువాత.. తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తనపై దోపిడి దొంగలు దాడి చేసి.. డబ్బును కాజేశారని, వారిని ఎదిరించే క్రమంలో తీవ్రంగా గాయపడినట్టు.. తనని తాను గాయపరుచుకున్నాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి స్థానికులకు, రైతులకు ఫోన్ చేసి.. జాతీయ రహదారిపై వస్తున్న తనని దుండగులు వెంబడించి..దాడి చేశారనీ, తన ఫోన్ ను పలగొట్టారనీ, తన వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలను అపహరించుకుపోయారని నమ్మబలికాడు. ఆసుపత్రికి వెళ్లిన శ్రీను ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

శ్రీను ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కానీ వారికి దోపిడి జరిగినట్టు ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మరోవైపు శ్రీను గురించి ఆరా తీస్తే.. అతడు చాలా మంచివాడని తేలింది. దీంతో కేసు క్షిష్టంగా మారింది.  ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో  శ్రీను వివాహేతర సంబంధం గురించి తెలిసింది. ఆ కోణంలో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్టు..  పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్ని విషయాలు బయటకొచ్చాయి. 

రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టటానికి పాన్ వేసినట్టు.. ఈక్రమంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి పత్తి అమ్మగా వచ్చిన రెండు లక్షల రూపాయలను ఇచ్చి పంపించినట్టు నిందితుడు శ్రీను ఒప్పుకున్నాడు. అనంతరం హైవే పై వస్తూ దోపిడీ జరిగినట్లు తనకు తానే గాయం చేసుకొని  నమ్మించే ప్రయత్నం చేశానని, ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్నట్టు తెలిపాడు. శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు మధ్యవర్తులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సురేష్ చెప్పారు. లేకుంటే రైతులు నష్టపోవాల్సి ఉంటుందన్నారు. నిందితుడు శ్రీను నుంచి 2 లక్షల డబ్బు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Follow Us:
Download App:
  • android
  • ios