గుంటూరు జిల్లా దాచేపల్లిలో నాటు తుపాకులు కలకలం రేపాయి. మద్యం అక్రమ రవాణా ముఠా వద్ద నాటు తుపాకులు వున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుుకున్నారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ మద్యం (telangana liquor) ఏరులై పారుతోంది. జగన్ సర్కార్ (jagan government) ఈ అక్రమమద్యం రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం వెనక్కితగ్గడం లేదు. ఇలా తెలంగాణ నుండి ఏపీకి మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసే ఓ మూఠా ఏకంగా తుపాకులనే ఉపయోగిస్తోంది. ఇలా దాచేపల్లి (dachepalli)లో ఓ ముఠా తుపాకులతో హల్ చల్ చేస్తోందని ఫిర్యాదు అందడంతో పోలీసులు గడ్డివాములో దాచిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దులో వుండటంతో గుంటూరు జిల్లా (guntur district)కు పక్కరాష్ట్రం తెలంగాణ నుండి మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది. ఏపీలో మద్యం దరలు అధికంగా వుండటంతో కొందరు పోలీసులు, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి తెలంగాణ మద్యాన్ని బార్డర్ దాటిస్తున్నారు. ఇలా అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు కొన్ని ముఠాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాల విషయంలో ఈ ముఠాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి.
Video
ఇలా ఆదివారం రాత్రి కూడా దాచేపల్లిలోని గ్రంథాలయ ప్రాంతంలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఈ గొడవలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఓ ముఠా వద్ద నాటు తుపాకులు వున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టే సదరు ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తుపాకులను ఓ పొలం వద్ద గడ్డివాములో దాచినట్లు బయటపెట్టారు.

ఈ ముఠా సభ్యులను వెంటబెట్టుకుని గడ్డివాము వద్దకు వెళ్లిన పోలీసులు మారణాయుదాలను స్వాదీనం చేసుకున్నారు. ఓ నాటు పిస్టల్ తో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మారణాయుధాలను కలిగిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
మంత్రుల పర్యటన ముందురోజే పల్నాడులో తుపాకులు లభ్యం కావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రుల పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
