కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కాగా... విజయ్ కుమార్ బలవన్మరణానికి వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఆయనకు మూడు నెలల క్రితం వివాహం కాగా.. భార్యను కాపురానికి తీసుకురాకుండా.. గుడివాడలో బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.