Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో టీడీపీ, వైసీపీ ఘర్షణలు: 14 మందిపై కేసులు నమోదు


గుడివాడలో  టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణలపై  పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయమై  ఇరువర్గాలకు చెందిన 14 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. 

Gudivada Police Files Case Against  14 members  in Gudivada police station
Author
First Published Dec 27, 2022, 2:22 PM IST

విజయవాడ:  గుడివాడలో   టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణకు సంబంధించి  రెండు వర్గాలపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇరువర్గాలకు చెందిన  14 మందిపై  పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందిన వారిపై  గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ నెల  25వ తేదీన రాత్రి గుడివాడలో  టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.  గుడివాడలో  రంగా  వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించవద్దని  తనను వైసీపీ నేతలు బెదిరించారని రావి వెంకటేశ్వరరావు  ఆరోపించారు. ఈ విషయమై  టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు  పరస్పరం దాడులు చేసుకున్నాయి.

పెట్రోల్ బాంబులతో  వైసీపీ వర్గీయులు  తమపై దాడికి యత్నించారని టీడీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే. వైసీపీ నేత  నరేంద్ర ఫిర్యాదుతో  మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వరావు సహా  పలువురిపై  కేసులు నమోదు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు  మెరుగుమాల కాశీ సహా మరో నలుగురిపై  కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే  తనపై దాడి చేశారని  కానిస్టేబుల్ హకీం  ఫిర్యాదు  చేయడంతో   మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సహా టీడీపీ శ్రేణులపై  కేసు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీ వర్గాలకు  చెందిన  14 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా  పోలీసులు ప్రకటించారు.

also read:వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి నేనే పోటీ చేస్తా: రావి వెంకటేశ్వరరావు

ఆదివారం నాడు రాత్రి నుండి నిన్నటివరకు  గుడివాడలో  టెన్షన్ నెలకొంది.  గుడివాడలోని వంగవీటి రంగా  విగ్రహనికి  మాజీ ఎమ్మెల్యే  రావి వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. గుడివాడ నుండి  మాజీ మంత్రి కొడాలి నానిని తరిమికొడతామని  రావి వెంకటేశ్వరరావు  చెప్పారు

రావి వెంకటేశ్వరరావు సహా టీడీపీ వర్గీయులపై దాడితో  వైసీపీకి సంబంధం లేదని  మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు.  రంగా అభిమానులకు టీడీపీ వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగిందన్నారు.  దీన్ని  తమ పార్టీకి  అంటగట్టేందుకు  టీడీపీ ప్రయత్నిస్తుందని  కొడాలి నాని  చెప్పారు.  

మాజీ మంత్రి కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు స్పందించారు.  కాళీకి వినాయకుడి గుడి చైర్మెన్ ను కొడాలి నాని  ఇప్పించలేదా  అని ఆయన ప్రశ్నించారు.  వంగవీటి రంగా  అందరి వాడన్నారు.  ప్రతి ఏటా గుడివాడలో  రంగా  వర్ధంతిని  నిర్వహిస్తున్న విషయాన్ని  రావి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios