Asianet News TeluguAsianet News Telugu

Gold Mines : ఏపీలో బయటపడ్డ బంగారు గనులు .. మళ్లీ ఆ జిల్లాలోనే

ఆంధ్రప్రదేశ్‌కు బంగారం లాంటి వార్త. రాష్ట్రంలో బంగారు గనులను గుర్తించినట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో బంగారంతో పాటు ఇతర ఖనిజాల గనులు వున్నట్లుగా ఎన్ఎండీసీ చెబుతోంది.

gsi found gold mines in kurnool district ksp
Author
First Published Dec 14, 2023, 5:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు బంగారం లాంటి వార్త. రాష్ట్రంలో బంగారు గనులను గుర్తించినట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో వీటిని గుర్తించినట్లుగా రాష్ట్ర జియోలాజికల్ బోర్డు సమావేశంలో అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో లభ్యమయ్యే బంగారం ఖనిజ నిల్వల పరిమాణం, నాణ్యత, ఎంత విస్తీర్ణంలో వున్నాయనే అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జీఎస్ఐ అధికారులు నిర్ణయించారు. 

ఇప్పటికే కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో బంగారు గనులున్నట్లుగా గుర్తించి.. అక్కడ తవ్వకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్పరి మండలంలోనూ గనులున్నట్లుగా తేలడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం లాభదాయకమా .. కాదా అన్న విషయాన్ని కూడా అధికారులు తేల్చనున్నారు. సర్వేను ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని జీఎస్ఐ భావిస్తోంది. అలాగే తాడిపత్రికి 12 కి.మీ దూరంలో గ్యాస్ నిక్షేపాలు వున్నాయని , వీటిని కూడా అంచనా వేసేందుకు ఓఎన్జీసీ సర్వే చేపట్టనుంది. 

అటు ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల్లో ఈ గని విస్తరించి వుందని సమాచారం. ఈ గనికి 2013లోనే అనుమతులు వచ్చాయి. బంగారాన్ని వెలికి తీసేందుకు అవసరమైన పనులు చేయడానికి 8 నుంచి 10 ఏళ్లు పట్టిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం వుందని అధికారులు తెలిపారు. ఇక్కడ ఏడాదికి 750 కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చని అంటున్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో బంగారంతో పాటు ఇతర ఖనిజాల గనులు వున్నట్లుగా ఎన్ఎండీసీ చెబుతోంది. ఇక్కడ బంగారంతో పాటు అనుబంధ ఖనిజాలను తవ్వుకునేందుకు ఎన్ఎండీసీ అనుమతి కోరినట్లుగా సమాచార. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios