మరికొన్ని గంటల్లోనే వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు మాయమయ్యాడు. దీంతో గురువారం నాడు జరగాల్సిన పెళ్లి రద్దైంది.  పెళ్లి కొడుకు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు.


విజయవాడ: మరికొన్ని గంటల్లోనే వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు మాయమయ్యాడు. దీంతో గురువారం నాడు జరగాల్సిన పెళ్లి రద్దైంది. పెళ్లి కొడుకు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఓ యువకుడికి పాత రాజేశ్వరీ పేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఆగష్టు 16 వతేదీన వివాహం జరపాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు.

పెళ్లి కోసం రెండు కుటుంబాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొన్నాయి. శుభ లేఖలు ఇస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిన పెళ్లి కొడుకు కన్పించకుండా పోయాడు. రాత్రైనా పెళ్లి కొడుకు ఆచూకీ లభ్యం కాలేదు. 

పెళ్లి కొడుకు కోసం ఎదురుచూసిన కుటుంబసభ్యులు బుధవారం రాత్రి పూట కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ముహుర్త సమయానికి కూడ పెళ్లి కొడుకు ఆచూకీ లభ్యం కాలేదు. 

దీంతో పెళ్లిని రద్దు చేశారు. పెళ్లి కొడుకు ఉపయోగించే సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే పెళ్లి కొడుకు అదృశ్యం వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.