Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన మరుసటి రోజే.. వరుడికి కరోనా.. షాక్ లో బంధువులు

అదే రోజు సాయంత్రం పెళ్లి కుమార్తె స్వగ్రామం ఎల్‌ తండాలో మరలా పెళ్లి జరిగింది. పెళ్లి కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ నెల 8న కరోనా పరీక్ష నిమిత్తం స్వాబ్‌ శాంపిల్స్‌ సేకరించారు.
 
groom gets coronavirus positive case after marriage in kurnool
Author
Hyderabad, First Published Jun 13, 2020, 11:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ దాదాపు పది వేల కేసులు నమోదౌతున్నాయి. తాజాగా ఓ పెళ్లి కుమారుడికి కరోనా సోకింది. దీంతో..  కుటుంబసభ్యులు అంతా షాక్ లో ఉన్నారు. ఈ సంఘటన కర్నూలులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్‌ నగరం తండాలో కరోనా పాజిటివ్‌ కేసు కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన యువతికి పత్తికొండ మండలం మర్రిమాను తండాకు చెందిన యువకుడితో ఈ నెల 10న మర్రిమాను తండాలో వివాహం జరిగింది. 

అదే రోజు సాయంత్రం పెళ్లి కుమార్తె స్వగ్రామం ఎల్‌ తండాలో మరలా పెళ్లి జరిగింది. పెళ్లి కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ నెల 8న కరోనా పరీక్ష నిమిత్తం స్వాబ్‌ శాంపిల్స్‌ సేకరించారు.

పెళ్లి అయిన తరువాతి రోజు అంటే ఈ నెల 11న నివేదిక వచ్చింది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో అటు పత్తికొండ, ఇటు వెల్దుర్తి మండలాల్లో కలకలం రేగింది. వెల్దుర్తి మండల అధికారులు తక్షణం స్పందించి ఎల్‌ తండాలో 70 గృహాలుండగా అందరికీ హోం క్వారంటైన్‌ నోటీసులిచ్చారు. రాకపోకలు బంద్‌ చేయించారు. పెళ్లి వేడుకలకు హాజరైన వ్యక్తుల వివరాలను సేకరించడమే కాకుండా.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ వ్యక్తుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios