సొంత మనవడినే ఆస్తికోసం హతమార్చాడో తాత. కొడుకు, కోడలు విడాకులు తీసుకుంటే ఆస్తి మనవడిక పోతుందని ఈ దారుణానికి తెగించాడు.
పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా మీనవల్లూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత మనవడినే హత్య చేశాడో తాతయ్య. కొడుకు, కోడలి మధ్య గొడవలతో విడాకులు తీసుకుంటే.. ఆస్తి మొత్తం మనవడికి పోతుందని దారుణానికి తెగించాడు. ప్రస్తుతం నిందితుడు నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు.
గత కొంతకాలంగా నాగేశ్వరరావు కొడుకు కోడలు మధ్య విభేదాలున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి సంబంధించిన ఒక బాలుడు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. బాలుడు ఊహించని విధంగా కాలువలో మృతదేహంగా తేలాడు. తాత సొంత మనవడిని వెంటబెట్టుకుని వెళ్లి మరీ హత్యకు హత్య చేసినట్టు తేలింది.
దారుణం.. గంజాయి తాగి, ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడు..
బాధితుడి తల్లి కుటుంబసభ్యులు దీనిమీద మాట్లాడుతూ.. 9వ తేదీ ఉదయం తమకు ఫోన్ వచ్చిందని.. భార్యభర్తలు గొడవపడుతున్నారని చెబితే 70కి.మీ దూరం వెళ్లామన్నారు. అక్కడికి వెళ్ళేసరికి బాలుడు వెంకట్ కల్యాణ్ కనిపించడం లేదని చెప్పారు. తండ్రితరఫు వారే బాలుడిని దాచిపెట్టారని మాకు అనుమానం వచ్చింది. దీంతో తండ్రి తరఫువారి మీద కేసు పెట్టాం.
బాబును తాత తీసుకెళ్లడం స్థానికులు చూశామని చెప్పారు. ఆ రోజునుంచి బాలుడు కానీ, తాత కానీ కనిపించడంలేదు. దీంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల అంతా వెతికాం. దగ్గర్లోని కాలువలో బాలుడి మృతదేహం దొరికింది. అని చెప్పారు. స్థానికులు ఈ ఘటన మీద మాట్లాడుతూ.. వారింట్లో భార్యభర్తలకు తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో బాలుడి తల్లి శిరీషకు ప్రమాదం తలపెడతారనుకున్నాం.. కానీ, బాలుడిని హత్య చేస్తారనుకోలేదని చెబుతున్నారు.
