కంటికి రెప్పలా కాపాడాల్సిన మనవరాలిని సొంత నానమ్మ, తాతయ్యలు అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  కృష్నా జిల్లా విజయవాడ సమీపానికి చెందిన మైనర్ బాలిక హేమ ను సొంత తాతయ్య, నానమ్మలు అత్యంత కిరాతకంగా హత్య  చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని గుంటూరు తీసుకువెళ్లి కాల్చేశారు. కాగా...  బాలిక తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సొంత మనవరాలిని వాళ్లు ఎందుకు చంపారు అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.