పీఆర్సీపై పీటముడి : రేపు మరోసారి ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఏపీ పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే పీఆర్సీ అంశంపై మరోమారు చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు సర్కార్ ఆహ్వానం పంపింది.

govt officials to meet ap govt employees over prc issue

ఏపీ పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే పీఆర్సీ అంశంపై మరోమారు చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు సర్కార్ ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో ఆర్ధిక శాఖ అధికారులతో రేపు మధ్యాహ్నం భేటీ కానున్నాయి ఉద్యోగ సంఘాలు.

కాగా.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల Prc విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. AP Employees union డిమాండ్ విషయమైChief Secretary  నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నుండి సానుకూలత కన్పించలేదు. దీంతో  సీఎం జగన్ తోనే పీఆర్సీ పై తేల్చుకొంటామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పారు.ఈ నెల 22న సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో  అధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

ఇక సీఎం  Ys jagan తో జరిగే సమావేశంలోనే తేల్చుకొంటామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఇక నేను చెప్పేదేం లేదు. చెప్పాల్సింది ముందే చెప్పేశాం.. ఏదైనా ఉంటే మీరే చెప్పండి... నా మాట అదే’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ.. ఈ  సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులకు తేల్చిచెప్పారు.  దీంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో జరిగే సమావేశంలోనే పీఆర్సీపై నిర్ణయం తీసుకొంటామని ప్రకటించారు.

Also Read:పీఆర్సీపై పీటముడి: సీఎంతోనే తేల్చుకొంటామంటున్న ఏపీ ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ‌పై మంగళవారం కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మరోసారి చర్చ జరిగినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫైనాన్స్‌ అధికారులు కొన్ని ప్రతిపాదనలను సీఎం జగన్‌ ముందు ఉంచారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. పీఆర్సీ అంశం  ప్రాసెస్ లో ఉందనీ,  పీఆర్సీ ఎంత  శాతం  ఇస్తారనే దానితో పాటు ఇతర అంశాలు  చాలా పరిశీలిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. 

కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ ఆలోచిస్తున్నారన్నారు. ఉన్నంతలో ఎంతో  కొంత  అధికంగా ఇవ్వాలని ఆలోచనలో  సీఎం ఉన్నారనీ, రాష్ట్రం పరిస్థితి బాలేదని , ఇదే  వాస్తవమ‌ని తెలిపారు.  రాజకీయంగా  అయితే  వెంటనే  చెయ్యచ్చు.. కానీ ఇందులో చాలా  అంశాలున్నాయనీ, పీఆర్సీ తో పాటు డీఏ పెండింగ్  ఉందనీ, ఇలా అన్ని అంశాలు  చూడాలని, మొత్తం  బరువు  మీద పడకుండా  చూసుకోవాలని అన్నారు. ఆర్ధిక పరిస్థితి  బాలన్స్  చేస్తూ..  నిర్ణయాలు  తీసుకోవాలని, కావాలని  పిఆర్సీ ఆలస్యం చెయ్యడం లేదనీ, ఆర్ధిక శాఖ  అధికారులు కసరత్తు  చేస్తున్నారని తెలిపారు. కాబట్టే కొంచెం ఆలస్యమవుతోందని సజ్జల తెలిపారు. త్వరలోనే పీఆర్సీపై సీఎం ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios