జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య రాజీనామాను  ప్రభుత్వం ఆమోదించింది. 

విజయవాడ: జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ ప్రొఫెసర్ శివ శంకర్ రావు కు జిజిహెచ్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. 

 లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో నాంచారయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాంచారయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె కంప్లయింట్ చేయడానికి కొన్ని గంటల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

గతంలోనూ నాంచారయ్యపై ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన వ్యవహారశైలిపై జిల్లా కలెక్టర్ విచారణ తర్వాత రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.