Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు సర్కార్‌కు షాక్: ఆర్డినెన్స్‌ను తిప్పికొట్టిన గవర్నర్‌

ఏపీ సర్కార్‌కు, గవర్నర్‌కు మధ్య మరోసారి వివాదం నెలకొంది.చుక్కల భూముల సమస్యలపై   ఏపీ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ తిప్పి పంపారు. దీంతో  ఏపీ సర్కార్‌కు గవర్నర్‌ కు మధ్య మరోసారి వివాదం నెలకొంది. గతంలో కూడ ఇదే  తరహాలో   నాలా ఆర్డినెన్స్‌ను కూడ గవర్నర్ నరసింహాన్ తిప్పి పంపారు.

governor rejects ap government ordinance
Author
Amaravathi, First Published Jan 30, 2019, 11:02 AM IST

అమరావతి:  ఏపీ సర్కార్‌కు, గవర్నర్‌కు మధ్య మరోసారి వివాదం నెలకొంది.చుక్కల భూముల సమస్యలపై   ఏపీ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ తిప్పి పంపారు. దీంతో  ఏపీ సర్కార్‌కు గవర్నర్‌ కు మధ్య మరోసారి వివాదం నెలకొంది. గతంలో కూడ ఇదే  తరహాలో   నాలా ఆర్డినెన్స్‌ను కూడ గవర్నర్ నరసింహాన్ తిప్పి పంపారు.

20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని అమ్ముకోకుండా ఉండేలా ఏపీ సర్కార్  ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ విషయమై ధరఖాస్తుకు ధరఖాస్తుకు కనీస పరిష్కార సమయం రెండు మాసాలు పెట్టడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చుక్కల భూముల విషయంలో ఏపీ సర్కార్‌కు చుక్కలు కనబడుతున్నాయి.

సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్‌ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒకటిని తిరస్కరించారు. ఇక 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్‌ తప్పుబట్టారు. కేవలం అసైన్‌మెంట్‌ ఆర్డినెన్స్‌ను మాత్రమే ఆమోదించారు. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 

స్వాతంత్య్రానంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు.

చుక్కల భూముల విషయంలో  గతంలో సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.చుక్కల భూముల విషయానికి సంబంధించి శివాజీ తన వద్ద ఉన్న సమాచారాన్ని ఏపీ సీఎం బాబుకు ఇచ్చారు.  

చుక్కల భూముల సమస్య పరిష్కారంలో అధికారులు తనకే చుక్కలు చూపుతున్నారని ఒకానొక దశలో చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు.  మరో వైపు ఈ విషయమై జాయింట్ కలెక్టర్లకు బదులుగా కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios